మరణించిన తన స్నేహితుడి కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సాయం అందించిన పదవ తరగతి మిత్రులు
ఏక్ దం న్యూస్, మానకొండూరు:
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన మీస శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా తనతో గోదావరిఖని, అనిత హైస్కూల్లో పదో తరగతి చదివిన మిత్రబృందం శ్రీనివాస్ కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సాయం అందజేసి భరోసానిచ్చారు.
శుక్రవారం చెంజర్ల గ్రామంలో మీస శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మిత్రబృందం ఇట్టి నగదును అందజేశారు. కష్ట కాలంలో అండగా నిలిచిన మిత్రబృందానికి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుపుల రామ్మూర్తి, బోళ్ల హరిప్రసాద్, ఉపసర్పంచ్ గడ్డి గణేష్, గొళ్లేన కొమురయ్య, లక్కర్స్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.