ఏక్ దం న్యూస్ ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట్ మోడల్ స్కూల్ విద్యార్థులు సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (IIIT బాసర) లో ఈ పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు ఒకేసారి సీట్లు సాధించి చరిత్రకెక్కారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంతటి ఘన విజయం సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.ఉపాధ్యాయుల నిరంతర మార్గదర్శకత్వం, విద్యార్థుల కఠోర శ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైందని పాఠశాల ప్రిన్సిపాల్ జి. గంగాధర్ పేర్కొన్నారు. పాఠశాలకు మరియు మండలానికి గర్వకారణంగా నిలిచిన విద్యార్థులను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం మరియు తల్లిదండ్రులు ఘనంగా అభినందించారు. ఈ విజయం భవిష్యత్తు తరాల విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు.