ఐకేపీ కేంద్రాలపై ఎమ్మార్వో సురేష్ మార్క్.. తాళ్లపల్లిలో ధాన్యం సేకరణ పూర్తి! ఐకెపి సెంటర్ మూసివేత కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు

ఏక్ దం న్యూస్ ఇల్లంతకుంట: మే 31
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని తాళ్లపల్లి గ్రామం ఐకేపీ (IKP) సెంటర్‌లో వరి ధాన్యం సేకరణ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. సెంటర్‌లోని పూర్తి ధాన్యాన్ని సేకరించి, సురక్షితంగా గోదాములకు తరలించిన అధికారులు, అనంతరం కొనుగోలు కేంద్రాన్ని మూసివేశారు.మండలం మొత్తం నిరంతర పర్యవేక్షణ.ఇల్లంతకుంట తహశీల్దార్ (ఎమ్మార్వో) సురేష్ కేవలం తాళ్లపల్లి గ్రామానికే పరిమితం కాకుండా, మండలంలోని ప్రతి ఐకేపీ కేంద్రాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.సమస్యల తక్షణ పరిష్కారం: ఏ కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా, ఆయన వెంటనే అక్కడికి చేరుకుని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.అధికారుల సమన్వయం: వివిధ శాఖల అధికారులను నిరంతరం సమన్వయం చేస్తూ, ధాన్యం రవాణాలో ఎలాంటి ఆలస్యం జరగకుండా, త్వరితగతిన గోదాములకు చేరేలా చొరవ చూపుతున్నారు.తాళ్లపల్లి గ్రామంలోని అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి గోదాములకు తరలించడంతో పాటు, మండలం మొత్తంలో ధాన్య సేకరణను వేగవంతం చేసిన తహశీల్దార్ సురేష్‌కు తాళ్లపల్లి గ్రామ రైతాంగంతో పాటు మండల రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు