ఏక్ దం న్యూస్ , ఇల్లంతకుంట మే 31 పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులను ప్రారంభించాలని ఎమ్మెల్యేతో కలిసి మంత్రికి వినతి పత్రం ఇచ్చిన వెల్జిపూర్ గ్రామ సర్పంచ్ నవీన్

ఏక్ దం న్యూస్ మానకొండూరు / ఇల్లంతకుంట:
తంగళ్ళపల్లి నుండి వెల్జీపురం - రహీంఖాన్ పేట వరకు PMGSY (ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన) కింద మంజూరై, పెండింగ్‌లో ఉన్న తారు రోడ్డు పనులను తక్షణమే ప్రారంభించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)కు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, వెల్జీపురం సర్పంచ్ నాయిని నవీన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. శనివారం రాత్రి సచివాలయంలో మంత్రి సీతక్కను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి సీతక్క సంబంధిత ఈఎన్‌సీ (ENC) జోగిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. పెండింగ్ ఫైలును పరిశీలించి, రోడ్డు పనులు వెంటనే ప్రారంభమయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుండ వెంకటేశం, వార్డు మెంబర్ బొజ్జ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గండికోట సురేష్, నాయకులు చిలువేరు స్వామి రెడ్డి, సోమిరెడ్డి అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.