ఏక్ దం న్యూస్ /వేములవాడ జూన్ 01: మానవసేవే మాధవసేవ - సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

ఏక్ దం న్యూస్/వేములవాడ, జూన్ 1:
ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం రోజున దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ఆవరణలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు చల్లని మజ్జిగను అందజేసి సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.వి ఆర్ ఫౌండేషన్‌కు చెందిన పురెళ్ళ గంగాధర్ ,ముంబై వాస్తవ్యులు గుగ్గిళ్ళ రాజవ్వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సమాజ సేవే లక్ష్యంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సాయి రూప చారిటబుల్ ట్రస్ట్, భక్తుల సేవలో భాగంగా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని పలువురు కొనియాడారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు పిల్లి బాబురావు,కోశాధికారి దూలం భూమేష్ గౌడ్, ఎద్దండి రాజు, సరళ, మల్కాపురం ప్రశాంత్, మోత్కుపల్లి శ్రీనివాస్ యాదవ్, పాల్గొని భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.