ఏక్ దం న్యూస్ ఇల్లంతకుంట జూన్ 02: నోవా హాస్పిటల్ సౌజన్యంతో గాలిపల్లి వాలీబాల్ ప్లేయర్లకు ఉచిత క్రీడా దుస్తులు,క్రీడాకారులకు 'నోవా హాస్పిటల్' అండ: రూ.20 వేల విలువైన దుస్తులు పంపిణీ చేసిన సర్పంచ్

ఏక్ దం న్యూస్ ఇల్లంతకుంట జూన్ 02:
మండలంలోని గాలిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం (సమ్మర్ క్యాంప్) ముగింపు సందర్భంగా మంగళవారం విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. కరీంనగర్ నోవా హాస్పిటల్ సౌజన్యంతో, డాక్టర్ రఘురాం రెడ్డి సహకారంతో స్థానిక సర్పంచ్ బద్ధం శేఖర్ రెడ్డి సుమారు రూ.20 వేల విలువైన క్రీడా దుస్తులను 60 మంది విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బద్ధం శేఖర్ రెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి వేసవి శిక్షణ శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. క్రీడలు ఉజ్వల భవిష్యత్తుకు నిచ్చెన లాంటివని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకుని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేకల పావని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బట్టు పద్మ శ్రీనివాస్, ఉప సర్పంచ్ రావుల శ్రీకాంత్ గౌడ్, వార్డు సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు సానబాబు, ఉపాధ్యాయ బృందం, సీనియర్ క్రీడాకారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.