ఏక్ దం న్యూస్ (ఇల్లంతకుంట) జూన్ 02:
మండలంలోని పోత్తూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం గ్రామీణ పండుగ వాతావరణంలో ఘనంగా ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ పట్నం అశ్విని శ్రీనివాస్, గ్రామ పాలకవర్గ సభ్యులు మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు లబ్ధిదారులతో కలిసి ఈ నూతన గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇళ్ల ప్రారంభోత్సవం చేసుకున్న లబ్ధిదారులకు సర్పంచ్ మరియు ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా మొక్కలను అందజేసి, నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బండారి నరేష్ గౌడ్, వార్డు సభ్యులు మల్లేష్, మౌనిక మల్లేష్, సతీష్, వెంకట్ రెడ్డి, రాములు, అనిల్ కుమార్, పావని చంద్రమౌళి, మమత నవీన్ కుమార్ పాల్గొన్నారు. అలాగే ఇందిరమ్మ కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, పరశురాములు, శ్రీకాంత్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, జీపీ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.