ఏక్ దం న్యూస్/కోనరావుపేట జూన్ 02: పాలకుల పట్టింపులేమికి నిదర్శనం పండుగ పూట రోడ్డెక్కిన మంగళ్లపల్లి ఆవేదన! పరిపాలనా సౌలభ్యం కాగితాలకేనా? కోనరావుపేట టు వేములవాడ ఒక గ్రామం చేస్తున్న సరిహద్దు పోరాటం!

ఏక్ దం న్యూస్/కోనరావుపేట జూన్ 02:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేళ కోనరావుపేట మండలంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తమ గ్రామాన్ని వేరే మండలంలో కలపాలంటూ ఓ గ్రామస్తుడు చేసిన వినూత్న నిరసన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.మంగళపల్లి గ్రామం ప్రస్తుతం కోనరావుపేట మండలంలో ఉంది. అయితే, గ్రామస్తులు తమ మండల కేంద్రానికి వెళ్లాలంటే సుమారు 17 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో నిత్యం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ మా గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న వేములవాడ పట్టణం ఎంతో అందుబాటులో ఉంటుంది. పరిపాలనా సౌలభ్యం కోసం మంగళపల్లిని వేములవాడ మండలంలో విలీనం చేయాలి అని గ్రామానికి చెందిన ఉప్పుల జీవరత్నం అనే వ్యక్తి, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజునే ప్లెక్సీ పట్టుకుని నిరసన తెలిపారు. మంగళపల్లిని కోనరావుపేట నుండి వేములవాడకు మార్చాలంటూ ఆయన చేసిన ఈ డిమాండ్‌కు స్థానికుల నుండి మద్దతు లభిస్తోంది. అధికారులు స్పందించి తమ ఇబ్బందులను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు