ఏక్ దం న్యూస్ ఇల్లంతకుంట జూన్ 03 : రైతులను ముంచినోళ్ల కు పెద్దపీట వేస్తారా? ఇల్లంతకుంట లో పేలిన అసంతృప్తి బాంబ్" ఇల్లంతకుంట కాంగ్రెస్‌ లో తీవ్ర కలకలం సొంత పార్టీ నాయకత్వంపై బద్దం ఎల్లారెడ్డి ధ్వజం

ఏక్ దం న్యూస్ ఇల్లంతకుంట జూన్ 03 :

డబ్బు సంచులు మోసేవాళ్లకే పెత్తనమా? ఇల్లంతకుంట కాంగ్రెస్‌లో ముదిరిన వివాదం
పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను పక్కనపెట్టి, పదవులను అమ్ముకుంటూ అరాచకాలకు పాల్పడుతున్న వారిపై కాంగ్రెస్ నాయకుడు బద్దం ఎల్లారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను సస్పెండ్ చేసే స్థాయి మండల అధ్యక్షుడికి లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకే తనపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక నాయకత్వంపై, 'షాడో' పాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు.గాలిపల్లి పీఏసీఎస్ (PACS) చైర్మన్ పదవిని రూ. 30 లక్షలకు అమ్ముకున్నారని ఎల్లారెడ్డి ఆరోపించారు. గతంలో వేణుగోపాల సొసైటీలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి, 7 గ్రామాల పరిధిలోని 350 మంది రైతులను ముంచిన అవినీతిపరుడిని పార్టీలోకి చేర్చుకోవడం దారుణమన్నారు.కష్టపడ్డవారికి అవమానం – సంచులు మోసేవారికి పెత్తనం: పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కవ్వంపెల్లి బ్రతిమిలాడితే వచ్చి, ఇల్లంతకుంటలో పార్టీని భుజాన వేసుకుని నడిపించానని గుర్తుచేశారు. జెండా మోసిన పేద నాయకులను, కార్యకర్తలను పక్కనపెట్టి, డబ్బు సంచులు తెచ్చేవారికి, సెటిల్‌మెంట్లు చేసేవారికే పదవులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండలంలో ఒక ముగ్గురు నాయకులు 'షాడో'తో జతకట్టి అరాచకాలకు పాల్పడుతూ మండలాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.