ఇల్లంతకుంట ( ఏక్ ధం న్యూస్) జూన్ 03:
ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట్ తెలంగాణ మోడల్ స్కూల్‌లో 6వ తరగతితో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల ఎంపిక జాబితాను విడుదల చేసినట్లు ప్రిన్సిపాల్ జి. గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు.
గత ఏప్రిల్ 19న నిర్వహించిన ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్, రోస్టర్ విధానం ఆధారంగా 6వ తరగతికి 97 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ఆయన వివరించారు. అలాగే, ఇంటర్ ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, పదో తరగతి మెరిట్ మరియు రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఎంపికైన విద్యార్థుల పూర్తి జాబితాను పాఠశాల నోటీస్ బోర్డులో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.ఈ నెల 6 లోగా సర్టిఫికేట్ల పరిశీలన
ముఖ్య గమనిక: ఎంపికైన విద్యార్థులు ఈ నెల 6వ తేదీన తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో స్కూల్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.తీసుకురావాల్సిన పత్రాలు:
బదిలీ ప్రమాణ పత్రం బోనాఫైడ్ సర్టిఫికేట్ , కుల ధ్రువీకరణ పత్రం ఆధార్ కార్డ్ ,మార్కుల జాబితా 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు నిర్ణీత గడువులోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరై ప్రవేశాలను ఖరారు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు