ఇల్లంతకుంట (ఏక్ ధం న్యూస్) జూన్ 10: ఇంటర్ ఫలితాలలో రహీంఖాన్ పేట్ ఆదర్శ కళాశాల ప్రభంజనం విద్యార్థుల కష్టానికి, లెక్చరర్ల అంకితభావాని కి ఈ ఫలితాలే నిదర్శనము

ఇల్లంతకుంట (ఏక్ ధం న్యూస్) జూన్ 11:
ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మరియు ఇంప్రూవ్‌మెంట్ ఫలితాలలో రహీంఖాన్ పేట్ ‘ఆదర్శ కళాశాల’ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ ఫలితాలలో కళాశాల విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో 89%, ద్వితీయ సంవత్సరంలో 98% ఉత్తీర్ణత సాధించి సరికొత్త రికార్డు సృష్టించారని ప్రిన్సిపల్ గంగాధర్ సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వేసవి సెలవుల్లో కూడా వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి, ఈ ఘన విజయానికి కారణమైన అధ్యాపక బృందాన్ని (లెక్చరర్స్) ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల కష్టానికి, లెక్చరర్ల అంకితభావానికి ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన కొనియాడారు.