ఏక్ దం న్యూస్ (ఇల్లంతకుంట) మే 02 శనివారం.
విద్యార్థులు నచ్చిన కోర్సును ఎంపిక చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలి. -సర్పంచ్ పట్నం అశ్విని
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు గ్రామంలోని ఈమధ్య వెలువడిన 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులను గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు తమకు నచ్చిన కోర్సును ఎంపిక చేసుకొని ఉన్నత విద్యనుభ్యసించి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఒక గమ్యాన్ని ఏర్పరచుకొని దానికోసం నిత్యం ప్రయత్నం చేయాలని సూచించారు