రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట ఎర్ర నర్సు పల్లె పెద్దమ్మ ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు ఈ మధ్య జరిగిన దొంగతనాలతో అప్రవత్తమైన గ్రామ ప్రజలు గ్రామ ఉపసర్పంచ్ గడ్డమీద పద్మ సహకారంతో ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం ఇల్లంతకుంట ఎస్సై అశోక్ తో కలిసి సిరిసిల్ల రూరల్ సిఐ నాగేశ్వరరావు సిసి కెమెరాలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు దొంగతనాలు నేరాల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా గ్రామంలోని యువత డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని సోషల్ మీడియా సైబర్ క్రైమ్ వంటి వాటిపై కూడా జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల యొక్క ప్రవర్తనను గమనిస్తూ కచ్చితంగా రోజులో ఒక గంట సేపు పిల్లలతో కలిసి సరదాగా గడపాలని దాని ద్వారానే పిల్లలకు అభద్రత భావం లేకుండా పిల్లలు వారు ఎంచుకున్న గమ్యంపై ఏకాగ్రతతో పట్టు సాధిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ తో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు