మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ రెండు నెలలుగా జీతాలివ్వని ప్రభుత్వం జీతాల్లేక ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన 18000 ల వేతనం ఇంకెప్పుడిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్ వాడి టీచర్లకు జీతాలివ్వలేని దుస్థితిలో ఉందని, రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ఒక ప్రకనలో పేర్కొన్నారు. మార్చి,ఏఫ్రీల్ నెలలకు సంబంధించిన జీతాలు ఇవ్వలేదని జీతాలు లేక అంగన్ వాడి టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అంగన్ వాడి టీచర్లకు 18000 జీతం ఇస్తామని హామీ ఇచ్చిందని కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన 13650 జీతాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేని దుస్థితిలో ఉందన్నారు. అసలు అంగన్ వాడి టీచర్లకు ఇవ్వాల్సిన జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని, ప్రభుత్వం స్పందించి వెంటనే అంగన్ వాడి టీచర్ల ఖాతాల్లో జీతాలు వెంటనే జమ చేయాలని అన్నారు.