ఏక్ దం న్యూస్ (ఇల్లంతకుంట) మే 02 శనివారం.
గాలి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగే సమ్మర్ క్యాంపును వినియోగించుకోవాలి - సర్పంచ్ బద్ధం శేఖర్.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గాలిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 7 నుంచి నెల రోజుల పాటు జరగనున్న సమ్మర్ క్యాంపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా ప్రాధికార సంస్థ మరియు కలెక్టర్ అనుమతితో జరగబోయే ఈ సమ్మర్ క్యాంపును క్రీడాకారులు సద్వినియోగపరుచుకోవాలని ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ బద్ధం శేఖర్ రెడ్డి కోరారు ఈ నెల రోజుల శిక్షణ కార్యక్రమం వ్యాయామ ఉపాధ్యాయుడైన సాన బాబు శిక్షణలో జరుగుతుందని తప్పకుండా అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారుఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు క్రీడాకారులు పాల్గొన్నారు