ఉత్తమ మార్కులు సాధించడం పట్ల అభినందనలు
ఏక్ దం న్యూస్, శంకరపట్నం:
శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామంలో ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తిర్ణులైన విద్యార్థిని విద్యార్థులను గ్రామ పంచాయతీ పాలకవర్గం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎగ్గని శ్రీలత మాట్లాడుతూ పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కుల సాధించడం అభినందనీయమని భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి కన్న తల్లిదండ్రులకు పెరిగిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతం రాజేశం, వార్డు సభ్యులు మెడిశెట్టి రాజేష్, వనపర్తి మల్లేశం సంబు హరీష్, పంచాయతి కార్యదర్శి సుమన్, నాయకులు ఎగ్గని రమేశ్, సంబు రాజు తదితరులు పాల్గొన్నారు.