దహన ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయలు ఇచ్చిన ఎనుగుల అనిల్
శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో ఆదివారం అనారోగ్యంతో మరణించిన నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్కపెల్లి యాకూబ్ కుటుంబానికి బిజెపి మండల అధ్యక్షుడు, మాజీ ఎంపిటీసి ఎనుగుల అనిల్ బాసటగా నిలిచాడు. సోమవారం యాకుబ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, అదైర్యపడవద్దని దైర్యం చెప్పి దహన ఖర్చుల నిమిత్తం తన వంతుగా ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి తన ఉదారతను చాటుకున్నాడు. నిరుపేద కుటుంబానికి బాసటగా నిలిచిన అనిల్ ను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొజ్జ కోటిలింగం, గూళ్ళ రాజు, బొజ్జ సాయి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.