ఏక్ దం న్యూస్ ( ఇల్లంతకుంట) సోమవారం, 04 మే.
విద్యార్థులు ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు సాధించాలి-సర్పంచ్ గన్నేరువరం వసంత నరసయ్య
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పెద్ద లింగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఘనంగా శాల్వాతో సత్కరించిన సర్పంచ్ వసంత నర్సయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో ఏకాగ్రతతో భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు గ్రామానికి ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని. పట్టుదలతో చేస్తే ఏదైనా సాధ్యమే అవుతుందని చెడు అలవాట్లకు పోకుండా ఉపాధ్యాయులు చెప్పింది శ్రద్ధగా విని విధిగా పాటించి భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ,ఉపాధ్యాయులు గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రజలు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.