ఏక్ దం న్యూస్ ( ఇల్లంతకుంట):04 మే,సోమవారం: మండల రైతులెవరు పశుగ్రాసాన్ని కాల్చి పర్యావరణాన్ని పాడు చేయొద్దు- శ్రీ కృష్ణ గోశాల ట్రస్ట్ చైర్మన్ అయ్యన్న గారి హరికృష్ణ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ కృష్ణ గోశాల ట్రస్ట్ చైర్మన్ సోమవారం మధ్యాహ్నం ఓ ప్రకటనలో మాట్లాడుతూ మండలంలోని ప్రజలు ఎవరూ కూడా వారి ప్రశుగ్రాసాన్ని కాల్చి బూడిద చేయొద్దని తద్వారా పర్యావరణం కలుషితమై పలు రకాల వ్యాధులు పంట నష్టాలు వచ్చే అవకాశం ఉందని రైతులు ఎవరైనా సరే మండల కేంద్రంలోని శ్రీకృష్ణ గోశాలకు వారి యొక్క పశుగ్రాసాన్ని వితరణ చేయడం ద్వారా పశువులకు ఆహారాన్ని అందించిన వారవుతారని ఎవరు కూడా కాల్చద్దు అని ఈ సందర్భంగా ఆయన కోరారు. వరిగడ్డిని గోశాలకు వితరణ చేయడం ద్వారా గోరక్షణతో పాటు సేంద్రీయ ఎరువు తయారీకి మీరు తోడ్పడు చేసిన వారు అవుతారని అన్నారు సోమవారం ఉదయం మండలంలోని అనంతారం వెంకట్రావుపల్లి , వంతడుపుల ఇతరత్రా గ్రామాల నుంచి గోశాలకు పశుగ్రాసాన్ని వితరణ చేసిన రైతులను ట్రస్టు చైర్మన్ తో పాటు సభ్యులు కలిసి సత్కరించి వారికి అభినందనలు తెలియజేశారు