టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ

ఏక్ ధం న్యూస్ మానకొండూర్ : కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో మండల అధ్యక్షుడు కంది రాజిరెడ్డి ఆధ్వర్యంలో పల్లె చౌరస్తాలో టపాకాయలు పేల్చి, స్వీట్లు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా నాయకులు పార్టీ విజయాన్ని కార్యకర్తలతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు అంబటి తిరుపతి రాజు, ప్రధాన కార్యదర్శులు శీలం కుమార్, వార్డ్ మెంబర్ భాషబోయిన ప్రదీప్ యాదవ్, ఉపాధ్యక్షులు మీసా రమణయ్య, ఏదులాపురం అశ్విన్ తేజ, మండల నాయకులు కత్తి ప్రభాకర్ గౌడ్, గాడిచర్ల భూమయ్య, బుద్దుల తిరుపతి, బీజేవైఎం మండల అధ్యక్షుడు కొండ్ర వరప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి మర్రి ఆంజనేయులు, పులిచర్ల మహేందర్, మాదాసు కుమార్, జంగిలి రాకేష్, తాళ్ల పెళ్లి సంపత్, బీరం రమేష్, తంగళ్ళపల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు.