డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
ఏక్ ధం న్యూస్,తిమ్మాపూర్ :
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన ఈనాడు రిపోర్టర్ బొజ్జ రాజ్‌కుమార్ ప్రమాదవశాత్తు మృతి చెందడం పట్ల మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన రాజ్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు.
ఈ సందర్భంగా రాజ్‌కుమార్ ఇద్దరు పిల్లలను అక్కున చేర్చుకుని ఎమ్మెల్యే భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే వెంట తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారు రమేష్, పోరండ్ల గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు చింతలపల్లి తిరుపతిరెడ్డి, సర్పంచ్ అసోద శ్రీనివాస్, నాయకులు ఆరేపల్లి రమణారెడ్డి, శ్రీగిరి రంగారావు, పోలు రాము తదితరులు ఉన్నారు.